భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతదినోత్సవం సందర్భంగా రెండవ రోజు వేడుకలు స్థానిక చదువుల రామయ్య నగరంలో మరియు కల్లుబావి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు సామెలప్ప, మహిళా సమైక్య నాయకురాలు గోవిందమ్మ గారు పార్టీ పతాకాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని, సిపిఐ పార్టీ గడిచిన 100 సంవత్సరాల చరిత్రను గౌరవించామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు ప్రసంగించారు.
సిపిఐ 1925లో కాన్పూర్లో ఆవిర్భవించినప్పటి నుంచి పేదల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనపై చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ భవిష్యత్ లక్ష్యాలను చర్చించారు. బడుగు బలహీన వర్గాల కోసం మరింత సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. శతదినోత్సవ వేడుకలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయి.