కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, నిరుపేదలకు శాపంగా మారిందని మాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమాజీ మంత్రి, మహేష్ నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో గల కందుకూరు మండలంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ఆమె 64 చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఈ మాటలను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…….తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కెసిఆర్ ఇచ్చినటువంటి కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లక్ష రూపాయలు ఎట్లాగో వస్తాయి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు ఇచ్చిన తులం బంగారం ఎక్కడ పోయింది అని, అలాగే గృహలక్ష్మి ద్వారా మహిళకు 2500 రూపాయలు ఎక్కడికి పోయిందని, ఒకే ఇంట్లో పెన్షన్లు అవ్వకు, తాతకు కలిపి రెండు పెన్షన్లు ఇస్తానన్న మాట ఏడ పోయింది అని, రైతులకు ఇచ్చిన మాట ఏడ పోయింది ఏ రంగం పైన ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టానుసారంగా అన్ని రంగాల లో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పైన అవగాహన లేకుండా ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారని అంతేకాకుండా కెసిఆర్ గారి హయాంలో ఫార్మాసిటీ నిర్మించడం జరిగిందని ఆ ఫార్మసీలో కోల్పోయిన భూముల హక్కుదారులందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వారందరికీ భూములు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామన్న మాట ఏడ పోయింది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు శాపమని సబితా ఇంద్రారెడ్డి
