కడప జిల్లా పోరుమామిళ్ళ మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ పొలం 1854 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని అక్కలరెడ్డిపల్లె, కృపానగర్ గ్రామాలకు చెందిన భూమి లేని పేద ఎస్సీలకు పంపిణి చేయాలని గతంలో కలెక్టర్,RDO,MRO ల దృష్టికి తీసుకెళ్లి ఈ భూమితాలుకు సంబంధించిన కంపచెట్లు కూడా కొట్టుకోవడం జరిగింది.
కానీ మాకు ఇవ్వకుండా కొందరు అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా మేము చెట్లు కొట్టిన భూమిని డోజర్స్ పెట్టి చదును చేయడం జరుగుతుంది.
దయచేసి అధికారులు కల్పించుకుని ప్రభుత్వ భూమిని సర్వే చేసి భూమి లేని పేద వారికి పంపిణీ చేయాలని కోరుతున్నాము వారు ఆవేదన వ్యక్తం చేశారు.