సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు(Saudi Arabia Accident) ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఇందులో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారన్న వార్తలు వెలువడడంతో సీఎం వెంటనే స్పందించారు.
ప్రమాదంపై పూర్తివివరాలు తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీకి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాసులు ఎంత మంది ఉన్నారో వివరాలు వెంటనే సమీకరించాలని సూచించారు. కేంద్ర విదేశాంగ శాఖతో పాటు సౌదీ ఎంబస్సీ (saudi embacy)అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని స్పష్టం చేశారు.
అవసరమైతే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు.
రాష్ట్రానికి చెందిన వారి వివరాలు వెంటనే అందించాలని ఆయనను సూచించారు. ఘటన నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ALSO READ:PM Modi Puttaparthi Visit: సత్యసాయి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
