పల్లెటూళ్ల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు

MLA Prashanti Reddy emphasizes the government's commitment to rural progress through initiatives like the Pallai Panduga and infrastructure development. MLA Prashanti Reddy emphasizes the government's commitment to rural progress through initiatives like the Pallai Panduga and infrastructure development.

ముఖ్యమంత్రి (Chandrababu Naidu) ఉప ముఖ్యమంత్రి (Pawan Kalyan)గార్ల సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు మైపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి పడమర పాళెం మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మత్స్యకార సంఘాలకు చెందిన పెద్ద కాపులు శాలువాలు పూల బొకేలతో సన్మానించారు. పడమరపాలెం మత్స్యకార కాలనీలో నిర్మిస్తున్న బంగారమ్మ ఆలయ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 10 లక్షల వ్యయంతో మైపాడు గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం మరియు 82 లక్షల రూపాయల వ్యయంతో ఇందుకూరు పేట మండలం లోని వివిధ గ్రామాలలో జరగనున్న అభివృద్ధి పనులకు ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆగష్టు 23 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో 4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేస్తూ పల్లెలకు పూర్వవైభవం తెచ్చే దిశగా కృషి చేస్తోందన్నారు.

కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా గ్రామస్థులే నాణ్యతా ప్రమాణాలు పాటించి అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె ధన్యవాదాలు తెలియచేసారు.
పల్లె పండుగ పేరిట వారీగా దశల ప్రతి గ్రామానికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి గ్రామానికి సి సి రోడ్లు, మెరుగైన పారిశుధ్య నిర్వహణ కై డ్రైన్లు లాంటి మౌళిక సదుపాయాలను కల్పించే కార్యక్రమమే పల్లె పండుగని వెల్లడించారు. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరో వైపు కనీస వసతులు లేని పల్లెటూళ్లకు మౌలిక కల్పిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధించగల సామర్ధ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేంద్ర రెడ్డి, పంచాయతీ రాజ్ ఏ ఇ ఖాదర్ మస్తాన్, టీడీపీ మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల టిడిపి నాయకులు కైలాసం ఆదిశేషారెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, టిడిపి రాష్ట ముదిరాజ్ సంఘ అధ్యక్షులు పి ఎల్ రావు, బిజెపి సీనియర్ నాయకులు దువ్వూరు రాధాకృష్ణా రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, టిడిపి నాయకులు బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి మత్స్యకార సంఘాల పెద్ద కాపులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *