ChatGPT Ads Update: ChatGPT ని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఓపెన్‌ఏఐ(OpenAI) షాక్ ఇచ్చింది. త్వరలో చాట్‌జీపీటీలో ప్రకటనలు కనిపించనున్నాయని సంస్థ స్పష్టం చేసింది. అయితే వెంటనే యాడ్స్ ప్రారంభం కావని, రాబోయే రోజుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీకి 80 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది ఉచిత వర్షన్‌ను వినియోగిస్తున్నారు. భారీ నిర్వహణ ఖర్చులు పెరగడంతో కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రకటనల వైపు అడుగులు వేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
ALSO READ:తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ.. జడ్చర్లలో IIITకు సీఎం శంకుస్థాపన
యూజర్లు అడిగే ప్రశ్నలకు సంబంధించిన ఉత్పత్తులు లేదా సేవల ప్రకటనలు మాత్రమే చూపిస్తామని, అవి కూడా సమాధానాల కింది భాగంలో ఉంటాయని సంస్థ హామీ ఇచ్చింది. సమాధానాల నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, వ్యక్తిగత అవసరాలు, సున్నితమైన అంశాలపై యూజర్ల నమ్మకాన్ని ప్రకటనల కోసం ఉపయోగించుకోవడం ప్రమాదకరమని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియా సంస్థలు గతంలో ఇదే విధానాన్ని అనుసరించడంతో ఎదురైన పరిణామాలను వారు గుర్తుచేస్తున్నారు.
