ప్యారానగర్ డంపింగ్ యార్డు వ్యతిరేకించిన ప్రజలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మహిళలు, రైతులు, జేఏసీ నాయకులు కలిసి డంపింగ్ యార్డు వద్ద ముట్టడి ప్రయత్నం చేశారు. గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుతో భూగర్భ జలాలు కలుషితమవుతాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు….
