నేపాల్‌లో వరుస విమాన ప్రమాదాలు. తాజా హెలికాఫ్టర్ ప్రమాదం ఐదు మృతులు
నేపాల్ లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా గుర్తించారు. ఇటీవల (గత నెల చివరి వారంలో) త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలి, 18…