
బి కోడూరు టీచర్‌కు కారు ముఠా మోసం
కడప జిల్లా బి కోడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం మోసపోయారు. స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కారు ఆపి, తమ కారులో ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో వరలక్ష్మి కారును ఆపించుకుని దిగిపోయారు. అయితే, కొద్దిసేపటి తర్వాత మెడలోని మూడు తులాల సరుడు కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం…