Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeNationalBJP manifesto | బెంగాల్‌లో రాజకీయ వేడి.. బీజేపీ మేనిఫెస్టోతో కొత్త హామీలు

BJP manifesto | బెంగాల్‌లో రాజకీయ వేడి.. బీజేపీ మేనిఫెస్టోతో కొత్త హామీలు

-

Chat on WhatsApp

పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో(BJP manifesto) ‘సంకల్ప పత్రం’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార త్రిణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ మేనిఫెస్టో కేవలం హామీల పత్రం కాదని, బెంగాల్ అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలన గత 15 ఏళ్లుగా ప్రజలకు నిరాశ కలిగించిందని అమిత్ షా ఆరోపించారు.

కమ్యూనిస్టు పాలనను ముగించేందుకు ఇచ్చిన అవకాశాన్ని తృణమూల్ సద్వినియోగం చేసుకోలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రధానినరేంద్ర మోడీ విజన్ అయిన వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. గత దశాబ్దంలో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగి ప్రజల విశ్వాసాన్ని పొందిందని చెప్పారు. బెంగాల్ సంస్కృతిని కాపాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

official link:https://www.bjp.org/hi/pressreleases/west-bengal-election-manifesto-2026


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 294 స్థానాలకు రెండు విడతలుగా జరగనున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహించగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సంకల్ప పత్రం ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex surges 918 points as Indian stock markets close with strong gains

Stock market | బ్యాంకింగ్ షేర్ల జోరు.. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగింపు

Stock market: దేశీయ షేర్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చిన బలమైన కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించిన సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలాన్ని అందించాయి. దీంతో సెన్సెక్స్...
- Advertisement -
Chat on WhatsApp