Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeNationalAmarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర భక్తులకు గుడ్ న్యూస్... రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఎప్పుడంటే ?

Amarnath Yatra | అమర్‌నాథ్ యాత్ర భక్తులకు గుడ్ న్యూస్… రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఎప్పుడంటే ?

-

Chat on WhatsApp

Amarnath Yatra: హిమాలయాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే అమర్‌నాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు నిర్వహిస్తోంది. యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆరోగ్య ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా జమ్ముకశ్మీర్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటి 554 శాఖల్లో యాత్రికులు ముందస్తు నమోదు చేసుకోవచ్చు.

బోర్డు నిబంధనల ప్రకారం 13 సంవత్సరాల లోపు పిల్లలు, 70 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు యాత్రకు అనుమతి లేదు. అలాగే ఆరు వారాలకు పైగా గర్భంతో ఉన్న మహిళలు కూడా దరఖాస్తు చేయరాదు. భక్తులు 5 మంది నుంచి 30 మంది వరకు సమూహంగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.

ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు పాల్గొనే ఈ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారు. హిమాలయాల కఠిన వాతావరణ పరిస్థితుల్లో జరిగే ఈ యాత్ర భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని అందిస్తుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp