లగ్గం సినిమా ద్వారా మేము పెళ్లి చేసుకున్న పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని లగ్గం సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు. గత 50 సంవత్సరాలు క్రితం లగ్గం చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకున్నారో, లగ్గం అంటే ఇదేవిధంగా చేసుకోవాలనే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఈరోజులలో టెక్నాలజికల్ చాలా ఎక్కువైనా సందర్భంగా సంప్రదాయంగా చేసుకోవాల్సిన పెళ్లిళ్లు , సాఫ్ట్వేర్, హార్ట్ వేరు అనే పేర్లతో సంప్రదాయాన్ని మర్చిపోయి గత 30 ,40 సంవత్సరాలు అవుతుందని, అలాంటి పాత రోజులు ఈ సినిమా ద్వారా మళ్ళీ మాకు గుర్తుకు వచ్చాయని, ఈ సినిమా ద్వారా గత 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే లగ్గం చేసుకోవడం జరిగిందో, అదేవిధంగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా దర్శక నిర్మతలు తీయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సినిమా చూస్తుంటే అత్తమామలు అన్నదమ్ములు, అన్నా చెల్లెలు భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మళ్లీ తెరపైకి చూపించినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న రోజులలో ఇంజనీరింగ్ పేర్లతో వ్యవసాయాన్ని చాలామంది మరిచిపోయారని, వ్యవసాయం చేస్తే కూడా వ్యవసాయం పైన బ్రతకవచ్చు అని ఈ సినిమా ద్వారా నిరూపించారని లగ్గం సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా కామారెడ్డి పట్టణంలోని దర్శన్ టాకీస్లో వచ్చిందని కుటుంబ సమేతంగా వచ్చి చూడవలసిన లగ్గం సినిమా అన్నారు. బంధుత్వాలు అంటే ఏంటోవారికి సంబంధించిన బంధువులు వస్తే ఎలా మర్యాద చేయాలో అలాంటి సన్నివేశాలన్నీ ఈ సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుందని తెలిపారు. ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి మంచి సినిమా రావడం , ఇలాంటి మంచి సినిమా తీసిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు.