“ప్రార్థించే పెదవులకన్న సహాయం చేసే చేతులు మిన్న” అని ప్రతి ఒక్కరూ సేవాభావంతో జీవించాలని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాభారతి స్వామి వివేకానంద అవాస విద్యాలయంలో అన్నప్రసాద విరణ చేపట్టారు.
మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ తన కుమారుడు విహస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాలయంలో ఉన్న విద్యార్థులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. తన అన్నవారిలా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న వరప్రసాద్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ “మానవ జన్మకు అసలైన అర్థం సేవాగుణంతోనే లభిస్తుంది. మన చేతులచేత ఉపయోగపడే పనులు చేయడం గొప్పదనం” అని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మి రెడ్డి, సుధాకర్, శేఖర్ ఆర్‌పీ తదితరులు పాల్గొన్నారు. సేవాభారతి తరఫున వారు వరప్రసాద్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.