Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTAllu Sirish Pre Wedding Party | దుబాయ్ బ్యాచిలర్ పార్టీ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్...

Allu Sirish Pre Wedding Party | దుబాయ్ బ్యాచిలర్ పార్టీ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ విందు

-

Chat on WhatsApp

Allu Sirish Pre Wedding Party: అల్లు శిరీష్‌-నయనిక వివాహం కోసం గ్రాండ్‌ ఏర్పాట్లు మొదలయ్యాయి. మార్చి 6న జరగబోయే ఈ వివాహానికి ముందు, అల్లు అర్జున్‌ తన నివాసంలో ప్రత్యేక గ్రాండ్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి రామ్‌ చరణ్‌ దంపతులు, టాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దుబాయ్‌లో అల్లు శిరీష్‌ కోసం బ్యాచిలర్‌ పార్టీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అల్లు శిరీష్‌-నయనిక జంట గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నది అందరికి తెలిసిందే. వివాహానికి సంబంధించిన ఇన్విటేషన్స్ ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయి.

శిరీష్‌ తన తొలి శుభలేఖను మావయ్య మెగాస్టార్ చిరంజీవి కి అందించి ఆశీర్వాదం తీసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ పార్టీ ఫొటోలు వైరల్‌ అవుతూ అభిమానులలో మంచి ఆసక్తి రేకెత్తించాయి. అల్లు వారింట జరుగుతున్న ఈ వేడుక టాలీవుడ్‌లో మరో హైలైట్‌గా నిలుస్తోంది. పెద్ద కుటుంబం, సన్నిహితులు, సెలబ్రిటీలు కలిసి ఈ సన్నివేశాన్ని మరింత ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఫ్యాన్స్‌ కాస్త ముందే ఈ వేడుక ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. పెళ్లి సందర్భంగా ప్రత్యేక విందులు, కళారూపాలు, సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అల్లు శిరీష్‌–నయనికల ప్రేమ ప్రయాణం ఇప్పుడు వివాహ బంధంతో కొత్త అధ్యాయానికి చేరుకోబోతుందని అందరూ భావిస్తున్నారు.

ALSO READ:Raichur Fire accident | రాయిచూర్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం – భారీ ఆస్తి నష్టం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp