సైబర్ కేటుగాళ్లు నా కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు అని నాగార్జున వెల్లడించారు.ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన ఐబొమ్మ (I BOMMA)నిర్వాహకుడు అరెస్ట్ వివరాలపై మీడియా సమావేశంలో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటుడు నాగార్జున మాట్లాడుతూ. తన కుటుంబానికి చెందిన ఒకరు “డిజిటల్ అరెస్ట్”(Dgital Scam arrest)పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారని తెలిపారు.
ALSO READ:Telangana MLA Disqualification Case: స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో 4 వారాల గడువు
నాగార్జున వివరించగా ఉచితంగా సినిమా చూపిస్తామని చూపించే కొన్ని వెబ్‌సైట్లు పెద్ద ఉచ్చు. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన క్షణం మన ఫోన్ వివరాలు, వ్యక్తిగత డేటా మొత్తం కేటుగాళ్లకు వెళ్లిపోతుంది. ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ట్రాప్‌లో పడిపోయారు” అని చెప్పారు.
పైరసీ ముఠా భారీగా డబ్బు సంపాదిస్తోందని, “రూ.20 కోట్లు అనేది చిన్న సొమ్ము వీళ్ల అసలు సంపాదన వేల కోట్లలో ఉంటుంది” అని నాగార్జున స్పష్టం చేశారు. పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
