Monday, April 20, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadఇంజనీరింగ్ లో ఆవిష్కరణలపై అంతర్జాతీయ సదస్సు

ఇంజనీరింగ్ లో ఆవిష్కరణలపై అంతర్జాతీయ సదస్సు

-

Chat on WhatsApp

గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్” అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఇంజనీరింగ్ రంగంలో తాజా ఆవిష్కరణలపై చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా ESCI డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వరరావు మాట్లాడుతూ MSMU తరఫున తమకు ఏడు ప్రాజెక్టులు మంజూరైనట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకనుగుణంగా ఎగ్జిబిషన్ నిర్వహించి, యువ ఇంజనీర్లకు తమ ప్రతిభను మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ESCI ఆధ్వర్యంలో ప్రారంభించామని, ఇది రెండు సంవత్సరాల కోర్సు కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కోర్సులో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ మరియు బ్యాటరీ వాహనాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని వెల్లడించారు.

ప్రతి కొత్త ఆవిష్కరణకు MSMU తరఫున 15 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ నిధులను యువ ఇంజనీర్లు తమ ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని రామేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంజనీరింగ్ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

nara chandrababu naidu receiving birthday wishes from political leaders and celebrities

Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షల వెల్లువ.. మోదీ నుంచి జగన్ వరకు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ, సినీ రంగాల ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ (Twitter) వేదికగా...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102