పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ కేసు నమోదు

AP CID officials have registered a case against actor Posani Krishna Murali based on a complaint filed by TDP leader Bandaru Vamsikrishna. AP CID officials have registered a case against actor Posani Krishna Murali based on a complaint filed by TDP leader Bandaru Vamsikrishna.

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారం చేశారని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును కించపరిచేలా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని, సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడినట్లు వంశీకృష్ణ చెప్పారు. వంశీకృష్ణ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఐటెలికల్ 111, 196, 353, 299, 336 (3)(4), 341, 61(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *