Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeInterNationalట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ సెనేటర్ గా విజయం

ట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ సెనేటర్ గా విజయం

-

Chat on WhatsApp

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రాన్స్ జెండర్ గా చరిత్ర సృష్టించిన సారా మెక్ బ్రైడ్, డెలావేర్ నుంచి సెనెట్ కు పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఈ ఘనత సాధించిన సారా మెక్ బ్రైడ్ తొలిసారి అధికారికంగా సెనేట్ లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్‌గా రికార్డులకెక్కారు. మంగళవారం పోలింగ్ ముగిశాక చేపట్టిన ఓట్ల లెక్కింపులో సారా ఆధిక్యం కనబరిచారు. మూడింట రెండొంతుల మంది ఓటర్లు ఆమెకు ఓటేశారు. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వాలెన్ ని 3 పాయింట్లతో ఓడించి, ఆమె ఈ ఘనత సాధించారు.

సెనేటర్ గా గెలిచిన తర్వాత సారా మెక్ బ్రైడ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “పునరుత్పత్తి విషయంలో స్వేచ్ఛను పరిరక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావేర్ ఓటర్లు గట్టిగా చాటిచెప్పారు. ఈ ప్రజాస్వామ్యం మనందరికీ కావలసినది” అని ఆమె పోస్టు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఆమె భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి కూడా వివరించారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా సారా మెక్ బ్రైడ్, “నేను గెలిస్తే, చైల్డ్ కేర్ ఖర్చులను అందరికీ అందుబాటులో ఉంచుతాను. ఉద్యోగస్తులకు పెయిడ్ ఫ్యామిలీ, మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తాను” అని హామీ ఇచ్చారు. అలాగే, హౌసింగ్, హెల్త్ కేర్ లో మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తానని, ట్రాన్స్ జెండర్ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడతానని, సభల్లో వారి తరఫున గళం వినిపిస్తానని ఆమె చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

revanth reddy meets nitin gadkari in delhi to discuss telangana infrastructure projects

CM Revanth Reddy | ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ.. గడ్కరీతో కీలక భేటీ, తెలంగాణకు...

CM Revanth Reddy: రాష్ట్రంలో మౌలిక వసతుల విస్తరణకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధానిలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం పొందేందుకు...
- Advertisement -
Chat on WhatsApp