బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి ముంబై ట్రాఫిక్ పోలీస్‌కి మెసేజ్ పంపించి, సల్మాన్ రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మెసేజ్‌లో సల్మాన్ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల సల్మాన్‌ఖాన్, హత్యకు గురైన మాజీమంత్రి బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీని బెదిరించిన 20 ఏళ్ల నిందితుడు నోయిడాలో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్‌ఖాన్‌గా గుర్తించారు. అతడు సల్మాన్ మరియు జీషన్ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దసరా వేళ జీషన్ కార్యాలయం వద్ద టపాసులు కాలుస్తుండగా బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారు. ఈ హత్యను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తనదిగా ప్రకటించింది.
సల్మాన్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాల వల్లే సిద్దిఖీని హత్య చేసినట్టు గ్యాంగ్ తెలిపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు.