కడప జిల్లా వేంపల్లి మండలం మాజీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిచ్చి రకరకాలు.ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది.జగన్ కు వున్నవి డబ్బు పిచ్చి,అధికార పిచ్చి వాటికోసం ఎంతకైనా దిగజారుతాడు,ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడు రాజశేఖర్ రెడ్డి మరణం కుట్ర పూరితం,దీనికి కారణం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అని వైకాపా శ్రేణులను రెచ్చగొట్టాడు.వైకాపా శ్రేణులు రిలయన్స్ ఆస్తుల మీద,పెట్రోల్,డీజల్ బంకుల మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి అధికారంలోకి వచ్చాక ముఖేష్ అంబానీకి ఘన స్వాగతం పలికి,పసందైన విందు భోజనం పెట్టి ముఖేష్ అంబానీ సిఫారసు చేసిన పారిశ్రామిక వేత్త పరిమళ నత్వానీకి రాజ్య సభ సీటు ఇచ్చాడు.జగన్ ఎంతటి ఆపద్ధమైన సులభంగా చెప్పగలడు,దిగజారగలడు అనేటందుకు ఇదొక మచ్చు తునక.
ఆస్తికోసం నవమాసాలు మోసి కన్న కన్న తల్లి మీదనే కోర్టు కెక్కాడు.ఎంతటి దూర్మార్గానికైనా పాల్పాడుతాడు అనేందుకు ఇది ఒక మచ్చు తునక జగన్ కు తల్లి లేదు,చెల్లి లేదునాన్నలేడు,చిన్నాన్న లేడు,హితులు లేరు,సన్నిహితులు లేరు ఉన్నదల్లా స్వార్థమే.అణువణువునా స్వార్థమే.స్వార్థ పరుడు ఇటువంటి వాళ్ళు సమాజానికి,ప్రజాస్వామ్యానికి ప్రమాదం ప్రజలు ఆలోచించాలి చంద్ర బాబు షర్మిల చదువుతున్నదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,మరికొందరు వైకాపా నాయకులు వ్యాఖ్యానించడం హాస్యాస్పదం.
నక్క ఎక్కడ నాగలోక మెక్కడ కాంగ్రెస్ ఒక వటవృక్షం.దానికి ఊడలు జగన్,చంద్రబాబు లాటి వాళ్ళు.దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ.రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య నేతలను భారత దేశ పొలిమేరల నుండి తరిమికొట్టిన పార్టీ.గాంధీ,నెహ్రూ,పటేల్,నేతాజీ,ఇందిరమ్మ,సోనియమ్మ లాంటి ప్రపంచ స్థాయి నాయకులు నాయకత్వం వహించిన పార్టీ.అటువంటి గొప్ప పార్టీకి ఎవరో వ్రాశిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు ఆ మాటకొస్తే బిజెపి వ్రాశిచ్చిన స్క్రిప్టులు చదివే అలవాటు వైకాపాకు వుంది.బిజెపి చేతిలో టిడిపి,వైకాపా,జన సేన లు కీలుబొమ్మలు ఏపి లో బీ అంటే బాబు,జే అంటే జగన్, పి అంటే పవన్ అని అందరికీ తెలుసుకాబట్టి పసలేని మాటలు వైకాపా నాయకులు మాట్లాడవద్దని సూచన ఆకాశం మీద ఉమ్మి వేస్తే తిరిగి వేసినవారి ముఖం మీదనే పడుతుందని వైకాపా నాయకులు తెలుసుకుంటే మంచిది.
జగన్ పై తులసిరెడ్డి తీవ్ర విమర్శలు
