ఖమ్మం జిల్లా వేంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందుకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కొద్దిమంది వ్యక్తులు రెండు బైకులపై అనుమానస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగా వేంసూర్ ఎస్సై సిబ్బందితో టెంపుల్ వద్దకు వెళ్ళగా పోలీసు వారిని చూసి అట్టి వ్యక్తులు పారిపోవుటకు ప్రయత్నించగా, ఎస్సై గారు మరియు సిబ్బంది బైక్లతో పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వారు కందుకూరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో దొంగతనం చేయడానికి రెక్కీ చేస్తున్నారని దొంగతనం చేయడానికి వాడే కటింగ్ ప్లేయర్, స్కూ డ్రైవర్, ఐరన్ రాడ్ ఉండటంతో అనుమానం వచ్చి వారిని తరువుగా విచారణ చేయగా వారి పేర్లు ఎల్లబోయిన గోపి, అద్దంకి గురవయ్య, అద్దంకి శివ ముంగి రాము, ముంగి కృష్ణ అండ్ కిట్టు మరియు ఒక బాల నేరస్థుడు ఉన్నాడు. వీరంతా పెనుగంచిప్రోలు దేవాలయం సమీపంలో వివిధ రకాల పనులు చేస్తూ జీవిస్తున్నారని వీళ్ళందరూ పెనుగంచిప్రోలు మరియు పరిసర ప్రాంత వాసులు అని చెడు వ్యాసనాలకు అలవాటు పడి జులై గా తిరుగుతుంటారని తెలిసింది. వీరిలో గోపి మరియు బాల నేరస్థుడు కలిసి మొదట జల్సాల కోసం మధిర బోనకల్ వత్సవాయి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో గంటలు మరియు హుండీలు దొంగతనాలు చేయగా, మధిర మరియు వత్సవాయి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయి అరెస్టు చేయడం జరిగినది. నిందితుడు గోపి బంధువులు అచ్చంపేట ఏరియాలో ఉండటం వలన గోపికి సత్తమ్మ తల్లి దేవాలయం గురించి అవగాహన ఉన్నది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గోపి మిగతా ఐదుగురు నిందితులతో కలిసి మొదట తేదీ 28-8- 2024న రెండు మోటార్ సైకిల్ పై అచ్చంపేట ఏరియాలో అడవి ప్రాంతంలో గల సత్యమ్మ తల్లి గుడి తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అమ్మవారి వెండి కిరీటాలు వెండి శతకోపం అమ్మవారి మెడలో బంగారు ఆభరణాలు మరియు హుండీలను పగలగొట్టి నగదు దొంగిలించుకుపోయినారు. తరువాత తేదీ 28 -82024 న రాత్రి వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలోని అంకమ్మ తల్లి గుడిలో తలుపులు పగలగొట్టి గుడిలోని సీసీ కెమెరాలు పగలగొట్టి అమ్మవారి నాలుగు కిరీటాలు మరియు వెండి గిన్నె స్పూను బంగారు గొలుసు సూత్రాలు దొంగిలించక పోయినారు. బంగారు వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్ముకున్నారని వెండి వస్తువులను కరిగించి, హుండీలలో దొంగిలించిన నగదు ₹1,50,000 మరియు అచ్చంపేట సత్యమ్మ తల్లి గుడిలో దొంగిలించిన బంగారు సూత్రాలు అమ్మగా వచ్చిన డబ్బులు మరియు వెండి ముద్దలను పెనుగంచిప్రోలు ముద్దాయి ఏవన్ గోపి ఇంట్లో దాచిపెట్టగా ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి పెనుగంచిప్రోలు వెళ్లి స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిలో ఎల్లబోయిన గోపి వత్సవాయి మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో గంటలు దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చినాడు అని ఎసిపి రఘు వెల్లడించారు.
వేంసూర్‌లో టెంపుల్ దొంగతనానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు అరెస్ట్
