నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఏ ఎస్ పి అవినాష్ కుమార్ సీఐ లు, ఎస్సైలు, కానిస్టేబుల్ పాల్గోనీ రక్త దానం చేశారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. పోలీసు అమరుల త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే వారు త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. అదేవిధంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు.
భైంసాలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో రక్తదాన శిబిరం
