కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ చెందిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా, దేశంలో అత్యున్నత విద్య అయినా జంతు శాస్త్రంలో డాక్టరేట్ ను సాధించడమే కాకుండా,మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని గతంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం పరమల్ల గ్రామంలో రక్తదాన శిబిరాలను నిర్వహించి 149 మెట్ల రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని,రక్తదాన సేవా కార్యక్రమాలతో పోలీసు శాఖలో ఆదర్శంగా నిలవడం అభినందనీయమని రక్తదాత డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.
రక్తదానంలో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్
