కె కోటపాడు, మండలం,ఆర్లి గ్రామపంచాయతీ పరిదిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఎ) నుంచి పూర్తి అనుమతులు పోంద కుండానే వైభవ్ హేబిటేట్స్ 46.62 ఎకరాల్లో అక్రమంగా లే-అవుట్ పనులు చేపాడుతుందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న. డిమాండ్ చేసారు మంగళవారం లేఆవట్ ప్రాంతాన్ని పరీశీంచిన అనంతరం అయిన మాట్లాడారు.వైభవ్ లేఆవట్ యాజమాన్యం 18.26 ఎకరాల్లో లే-అవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకొని, మిగిలిన భూమిలో అక్రమంగా చేరవేగంగా లేఅవుట్ పనులు చేసెస్తున్నారని తెలిపారు పలుకు బడి కల్గిన వైభవ్ యాజమాన్యం జోలికొస్తే వెళ్ల డానికి రెవెన్యూ, విఎంఆర్డిఎ, అధికారులు భయ పడుతున్నారని తెలిపారు వెంటనే లేఆవట్ పనులు ఆపి ధర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు, చదును చేస్తున్న భూమిలో ఎన్ని ఎకరాలకు భూమి వినియోగం చేస్తున్నారు భూమార్పిడి పన్ను ప్రభుత్వానికి చెల్లించారా లేదా!అన్న విషయాలు బైట పెట్టడం లేదన్నారు, అటు రెవెన్యూ అధికారుల నుంచి ఇటు వైభవ్ లే-అవుట్ ప్రతినిధుల వరకు ఎవరూ స్పందించడం లేదన్నారు ఆర్లిపంచాయతీ లోని సర్వే నెంబర్ 84/4, 84/5, 88 లో 46.62 ఎకారాల్లో లేఅవుట్ పనులు జరుగు తున్నాయని తెలిపారు.
దీంట్లో విఎంఆర్డిఎ నుంచి 84/5, 88 లో 18.26 ఎకరాలకు మాత్రమే ఎల్పి నెంబరు 72/2003/1167 ఇచ్చారని మిగిలిన భూముల్లో,లేఅవుట్ పనులు జరుగుతున్న 46.62 ఎకారాల్లో మిగింది అంతా అక్రమ లే-అవుట్ నని తెలిపారు దినికి రోడ్లు వేయడానికి ఆర్లి కొండ కింది భాగం లోని రోడ్డుకు అను కొని వున్న స్టీల్ ప్లాంట్ కు చెందిన భూముల నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపాట్టి తరలి స్తున్నారని తెలిపారు. ప్రతి రోజు వందల ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్న పైనుంచి వస్తున్న ఒత్తిళ్లతో తమకు ఎమి తెలియద న్నట్లు రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకొని పక్క నుంచి తప్పించుకొని వెళ్లిపోతున్నారని తెలిపారు,వైభవ్ యాజమాన్యం కోంత మంది బడాబాబులను తమగుప్పిట్లోపెట్టుకోవడంతో అక్రమ లే-అవుట్క్ అడ్డు చెప్పేవారు లేకుండా పోయారని తెలిపారు,ఆర్లి.నుంచి లేఅవుట్ వరకు ప్రభుత్వ రోడ్డులో వెడల్పు అయిన బిటి రోడ్ నిర్మించు కున్నారని తెలిపారు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా లే-అవుట్లోకి ప్రవేశించడానికి ముందున్న సర్వేనెంబరు 299/555 14.50 2, 84/15 24.30 2 3 38.80 సెంట్లు ప్రభుత్వ భూమికి అనుమతులు పొంది.ఈ 38.80 సెంట్లుకు వైభవ్ యాజమాన్యం చెల్లించిన ధర కూడా రెవెన్యూ అధికారులు అత్యంత రహస్యంగా ఉంచారని తెలిపారు వైభవ్ లేఆవట్ కు కొంత మేరకు ప్రభుత్వ భూమి ఇచ్చినట్లు అదికారులు చెబుతున్న ఏధరకు ఇచ్చారని సమాచారం మాత్రం తమ వద్దలేదని రెవెన్యూ అధికారులు తప్పించుకుంటున్నారని.తెలిపారు,వైభవ్ హేబిటేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ వేస్తున్న లే-అవుట్లో చెట్లు కొట్టడానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు. లేఅవుట్లో చెట్లు ఉన్నప్పటికీ అనుమతులు తీసుకోకుండానే తొలగించిన చేట్లు ఉన్న ప్రాంతమంతా గ్రావెల్ తో నింపె స్తున్నారని.తెలిపారు లేఅవుట్క్ పైన రిజర్వు ఫారెస్టు భూమి క్రింది స్థాయిలో గెడ్డలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ కింద స్థలం విడిచి పెట్టాలని.కాని గెడ్డలు కన్పించకుండా లే-అవుట్ వేసెస్తున్నారని అన్నారు మొత్తంగా లేఆవుట్ లో అడుగుఅడుగునా అక్రమాలే జరుగు తున్నాయని దీనిపై జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయిలో అదికారితో ధర్యాప్తు జరిపించాలని, అప్పటి వరకు లేఆవట్ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేసారు.