కురుపాం మండలం లో గిరిజనుల కొంగు బంగారం అయినా శ్రీ మాలతమ్మ అమ్మవారుకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకోట రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కురుపాం గ్రామంనకు చెందిన పొట్నూరు రవికుమార్ ,గునుపూరు రమేష్ ఊళ్ల సురేష్ గారు,అమ్మవారికి ఇత్తడి మకర తోరణాన్ని ఇరువురి కుటుంబ సభ్యుల సమేతంగా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మాలతమ్మ అమ్మవారికి భక్తులు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందదాయకం అని ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు,ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ మాలతమ్మ అమ్మవారికి మకర తోరణ సమర్పణ
