ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. పోయిన ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. గంటలోపే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.
ఇప్పటికీ రెండు నెలలు దాటిన ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రాలేదని దీనివలన మాదిగ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను మరిచిపోయి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ మాదిగలకు ఘోరమైన అన్యాయం జరుగుతుందని, ఈ డీఎస్సీ ఉద్యోగుల మీద ఎంతో ఆశపెట్టుకొని ఎదురుచూసిన మాదిగ నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తున్నట్లు ఉందని, ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ అవుతున్న 11వేల టీచర్లు మాదిగలకు భారీ నష్టం జరుగుతున్నదని, ఇప్పటికే ఉద్యోగులు లేక ఎంతో వెనుకబడిపోయాం న్యాయం చేయాలని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వేగవంతంగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని వర్గీకరణ అమలులోకి వచ్చేంతవరకు ఉద్యోగాలను పూర్తిగా నిలిపివేయాలని కోరుతు డిమాండ్ చేస్తున్నామని అన్నారు.