శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి రహదారి పనులకు శంకుస్థాపన

MLA Toyik Jagadishwari inaugurated roadworks to Sri Someshwara Temple in Kotipam, Parvathipuram Manyam district, enhancing accessibility for devotees. MLA Toyik Jagadishwari inaugurated roadworks to Sri Someshwara Temple in Kotipam, Parvathipuram Manyam district, enhancing accessibility for devotees.

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సరైన రోడ్డు సదుపాయం లేనందున కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం వల్ల దేవుని వద్దకే నేరుగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని ప్రజలు హర్షనీయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఉదయ శేఖర్ పాత్రుడు, నంగి రెడ్డి.మధుసూదన్ రావు, పొట్నూరు వెంకట నాయుడు,దేవస్థానానికి అభివృద్ధి చేస్తున్న కాపారపు ఫౌండేషన్ చైర్మన్ కాపారపు శివున్నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవాలయ అర్చకులు శ్రీనివాసరావు, వీరభద్ర స్వామి, చినబాబు, వామకేశ్వరరావు, ద్రోణ సోమేశ్వరరావు ఆలయ ఈవో మండల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *