శరన్నవరాత్రుల్లో భాగంగా నిర్మల్ దక్షిణ శాస్త్రి నగర్ దుర్గామాత అమ్మవారికి మేళ తాళాలతో, డప్పుల చప్పులతో, నృత్యాలతో దుర్గామాతకు బోనాలు సమర్పించారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనమిస్తుందని ఆ అమ్మవారు తమ కుటుంబాలను , పిల్లలను చల్లగా చూడాలని విద్యాబుద్ధులు బాగా రావాలని అమ్మవారి చూపులు మా అందరి పై ఉండాలని ప్రతి సంవత్సరము ఇలాగే బోనాలు సమర్పించుకుంటామని ఇది మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమానంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.
నిర్మల్‌లో దుర్గామాతకు బోనాల సమర్పణ
