ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి పార్టీ అని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలలో ఎక్కడ లేని విధంగా దేశం అభివృద్ధి చెందుతుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు, రామాయంపేట మండల కేంద్రంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ హాజరయ్యారు, అనంతరం ఓ బి సి మోర్చారాశా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి పార్టీ అని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక పది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అభివృద్ధిని చూసి ప్రజలంతా బిజెపికి మద్దతు పలుకుతూ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు, ఇతర పార్టీలలో సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని పెట్టినటువంటి ప్రలోభాలు కల్పించకుండా స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేన్ రెడ్డి, శ్రీనివాస్, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు భానుచందర్, ఓబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, అవినాష్ రెడ్డి, రమేష్,తదితరులు పాల్గొన్నారు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అభివృద్ధి ప్రస్తావన
