గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఆదివారం విశాఖ పర్యటన అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను సందర్శించారు. త్వరలోనే పర్యాటక సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో స్థానికంగా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే, మంత్రముగ్దులను చేసే పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు.