భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లో కలెక్టర్ జితేష్ బి పాటిల్ పర్యటించారు ఏరియా హాస్పిటల్ ని పరిశీలించిన కలెక్టర్ మౌలిక వసతులపై సిబ్బందికి సూచనలు చేశారు. స్థానిక వ్యవసాయ కళాశాల సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు బోధన తో పాటుగా రైతాంగానికి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కళాశాల సిబ్బంది కి సూచిస్తూ, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే కూరగాయల మేలు జాతి విత్తనాలు, మొక్కలు రైతులకు అందించే ఏర్పాటు చేయాలని, వాటికి నిధులు కల్పిస్తానన్నారు. ఇటీవల క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం దమ్మపేట, ముల్కలపల్లి మండలాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, డిజిటల్ కార్డు స్పెషల్ ఆఫీసర్ సుమ తో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అశ్వరావుపేట పర్యటనలో కలెక్టర్ జితేష్ బి పాటిల్ సూచనలు
