తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసిన గత వైసిపి పాలనకు నిరసనగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు సంఘీభావంగా పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జనసేన నాయకులు పాలూరు బాబు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు బాబు పాలూరు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన శ్రీవారి లడ్డులో కల్తీ మరియు జంతువుల కొవ్వు ను కలిపి పవిత్రతను తుంగలో కలిపారని అన్నారు. ఈ ప్రాయశ్చిత దీక్ష చేయడం 16 వేల గోవింద నామాలు జపిస్తూ యజ్ఞం చేయడం. జరిగిన పాపాన్ని తొలగించడం కోసం ప్రతి ఒక్కరం తిరుపతి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీవారి లడ్డు విషయంలో నాణ్యత మెరుగుపడిందని చెప్పారు. ఆ తర్వాత జనసేన నాయకులు బాబు పాలూరు మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఫల్యాలను మరియు రైతులకు ఇచ్చిన విత్తనాలలో కల్తీ పౌష్టిక ఆహారంలో కల్తీ,,మద్యంలో కల్తీ,, అన్ని విషయాల్లో కల్తీ చేసి దేవుడు విషయంలో కూడా కల్తీ చేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కోటము ప్రభుత్వం నాయకులు డొంకాడ రామకృష్ణ లచ్చిరెడ్డి రంజిత్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం
