శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో బిఎంఆర్ రెసిడెన్సి అపార్ట్మెంట్‌లో గణపతి లడ్డూ వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష ఆసక్తి నెలకొంది.
లడ్డూను రూ. 92 వేలకు శ్రీనివాస్ చౌదరి కుటుంబం దక్కించుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి, రజిని దంపతులు తమ కుమార్తె వికాసిని, కుమారుడు శ్రీ ముకుంద్ చౌదరితో కలిసి పాల్గొన్నారు.
సోమవారం నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో ఆ అపార్ట్మెంట్ నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో తమ కుటుంబం అభివృద్ధి చెందాలని శ్రీనివాస్ చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూ కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వారి కుటుంబానికి గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశించారు.
అదేవిధంగా స్వామివారి వస్త్రాలను నామాల శ్రీధర్ గౌడ్ రూ. 22 వేల రూపాయలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వినాయకుడి కృపతో సుఖసంతోషాలు కోరుకున్నారు.
లడ్డూ వేలంపాట నిర్వహణలో కమిటీ సభ్యులు విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమానికి ఆ కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరై గణపతి బజన పాటలు పాడుతూ ఉత్సాహంగా నిర్వహించారు.
కార్యక్రమంలో బిఎంఆర్ రెసిడెన్సి అధ్యక్షుడు మురారి రావు, మహేందర్ నాయక్, నాగరాజ్ యాదవ్, శివప్రసాద్ శ్రీనాథ్ తదితరులు పాల్గొని జయప్రదంగా నిర్వహించారు.