Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeInterNationalNathan Thomas | కాలేజీలో చేరాల్సిన వయసులోనే కాలేజీ ప్రొఫెసర్.. నాథన్ థామస్ అరుదైన ఘనత

Nathan Thomas | కాలేజీలో చేరాల్సిన వయసులోనే కాలేజీ ప్రొఫెసర్.. నాథన్ థామస్ అరుదైన ఘనత

-

Chat on WhatsApp

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని మరోసారి నిరూపించాడు అమెరికాకు చెందిన నాథన్ థామస్(Nathan Thomas) కేవలం 18 ఏళ్లకే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి అరుదైన ఘనత సాధించాడు. చాలామంది ఈ వయసులో కాలేజీలో అడుగుపెడుతుంటే, అదే 18 ఏళ్ల వయసులో కాలేజీ విద్యార్థులకు బోధించే ప్రొఫెసర్‌గా(Youngest Professor) చరిత్ర సృష్టించాడు. మయామి డేడ్ కాలేజీలో అధ్యాపకుడిగా నియమితుడై, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. దీంతో 1717లో స్కాట్లాండ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్‌లారిన్ నెలకొల్పిన 306 ఏళ్ల రికార్డు బద్దలైంది.

నాథన్ విద్యా ప్రస్థానం కూడా అసాధారణమే. పదేళ్లకే డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ ద్వారా కాలేజీ చదువు ప్రారంభించిన ఆయన, 14 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేశాడు. అనంతరం తాను చదివిన మయామి డేడ్ కాలేజీలోనే ప్రొఫెసర్‌గా చేరి 2023 నుంచి ‘C for Engineers’ కోర్సును బోధిస్తున్నాడు. ప్రస్తుతం మయామి యూనివర్సిటీ లా స్కూల్‌లో జ్యూరిస్ డాక్టర్ (JD) చదువుతున్న నాథన్, భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కుల న్యాయ నిపుణుడిగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వయసు కాదు.. నేర్చుకోవాలనే తపన, కృషి, అంకితభావమే విజయానికి అసలైన మార్గమని ఆయన చెబుతున్న సందేశం ప్రపంచ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp