Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalలార్డ్స్‌లో చాంపియన్స్ తుదిపోరు

లార్డ్స్‌లో చాంపియన్స్ తుదిపోరు

-

Chat on WhatsApp

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15వ తేదీ (2025) వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది. 

లార్డ్స్ మైదానం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి అవుతుంది. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ వేదిక అయ్యాయి. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా విజయం సాధించాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఎంతోమంది ఐసీసీ మూడో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ తెలిపాడు. 2025 ఎడిషన్ కోసం తేదీలను ప్రకటించినందుకు ఆనందంగా ఉందన్నాడు. టెస్ట్ క్రికెట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది… ఆకర్షిస్తోందన్నాడు. టిక్కెట్లకు డిమాండ్ ఉంటుందని తెలిపాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

david warner drink driving case update in sydney

David Warner | పాకిస్థాన్ సూపర్ లీగ్ కు షాక్… డేవిడ్ వార్నర్ అరెస్ట్

David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్యం మత్తులో కారు నడిపిన కేసులో చిక్కుకున్నారు. సిడ్నీలోని మరౌబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన సాధారణ శ్వాస పరీక్షలో ఆయన కారును ఆపగా, మొదటి...
- Advertisement -
Chat on WhatsApp