Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeNationalSupreme Court | మతం మారితే రిజర్వేషన్‌కు గుడ్‌బై?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court | మతం మారితే రిజర్వేషన్‌కు గుడ్‌బై?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

Scheduled Caste: మతం మారితే షెడ్యూల్డ్ కుల హోదా కూడా కోల్పోతారా? అనే ప్రశ్నకు సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. మార్చి 2026లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టం చేసింది.

మతం మారిన వెంటనే ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని, ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ప్రయోజనాలు పొందడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చింది. ఇతర మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని, ఆ హోదా పునరుద్ధరణకు చట్టంలో పేర్కొన్న మూడు షరతులు తప్పనిసరిగా నెరవేర్చాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. దీంతో మత మార్పిడి, రిజర్వేషన్ హక్కులకు సంబంధించిన ఈ అంశంపై మరోసారి న్యాయపరమైన స్పష్టత వచ్చినట్లైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Pawan Kalyan

Pawan Kalyan | తక్కువ ధరకే బియ్యం విక్రయాలు.. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: బియ్యం ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందించే...
- Advertisement -
Chat on WhatsApp