Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeNationalHeavy Rainfall  | వర్ష బీభత్సం.. నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్

Heavy Rainfall  | వర్ష బీభత్సం.. నీట మునిగిన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్

-

Chat on WhatsApp

Heavy Rainfall: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. కుండపోత వానల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రన్‌వేపై నీరు నిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో అహ్మదాబాద్‌లో ఏకంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షం కారణంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు విమానాశ్రయ కార్యకలాపాలపై కూడా వర్ష ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రయాణికులు విమానాల సమయాలను ముందుగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Elderly man speaking during a public protest with people listening

Public Protest | విమర్శకు హద్దులు ఉండాలి.. సంస్కారం మర్చిపోవద్దు!

Public Protest: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు యువతపై ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొన్న ఓ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ప్రభుత్వ...
- Advertisement -
Chat on WhatsApp