Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAP Governor | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

AP Governor | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

-

Chat on WhatsApp

AP Governor: హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను గవర్నర్ పరామర్శించి, ఆరోగ్యంపై ఆరా తీశారు. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్న తీరుపై వైద్యుల సూచనలు తెలుసుకుని, వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు.

వైద్యుల సూచనలు పాటిస్తూ త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అనంతరం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో కొన్ని వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం అవసరమని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp