Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeTelanganaRevanth Reddy | ప్రజల విశ్వాసమే నా బలం.. రెండు దశాబ్దాల ప్రస్థానంపై రేవంత్ రెడ్డి...

Revanth Reddy | ప్రజల విశ్వాసమే నా బలం.. రెండు దశాబ్దాల ప్రస్థానంపై రేవంత్ రెడ్డి ఎమోషనల్ మెసేజ్

-

Chat on WhatsApp

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ప్రజా జీవితంలో సాగిన ఈ 20 ఏళ్ల ప్రయాణం తనకు కేవలం రాజకీయ ప్రస్థానం మాత్రమే కాదని, ప్రజలతో ఏర్పడిన బలమైన అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి, ఒక సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణం రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతల వరకు చేరుకోవడం వెనుక ప్రజల ఆశీర్వాదం, నమ్మకం, కార్యకర్తల అంకితభావమే ప్రధాన కారణమని తెలిపారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారమే తన రాజకీయ ధ్యేయంగా కొనసాగిందని వెల్లడించారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో విజయాలు, సవాళ్లు, విమర్శలు, పోరాటాలు అన్నీ తన రాజకీయ జీవితంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. ప్రతి అడుగులో తనకు అండగా నిలిచిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

వారి విశ్వాసమే తనను మరింత బాధ్యతతో పనిచేసేలా ప్రేరేపిస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం మరింత కట్టుబాటుతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే తన లక్ష్యమని, ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ప్రజల కుటుంబ సభ్యుడిగా, ‘రేవంతన్న’గా వారి హృదయాల్లో స్థానం నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తానని భావోద్వేగంగా పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana rythu bharosa funds credited to over 67 lakh farmers

Rythu Bharosa | 6 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా.. ప్రభుత్వం కీలక...

Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. వానాకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమంలో కేవలం ఐదు రోజుల్లోనే...
- Advertisement -
Chat on WhatsApp