Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshPapikondalu | పర్యాటకులకు గుడ్ న్యూస్.. పాపికొండల బోటు విహారయాత్రలకు గ్రీన్ సిగ్నల్

Papikondalu | పర్యాటకులకు గుడ్ న్యూస్.. పాపికొండల బోటు విహారయాత్రలకు గ్రీన్ సిగ్నల్

-

Chat on WhatsApp

Papikondalu: ప్రకృతి అందాలకు నిలయమైన పాపికొండల విహారయాత్ర మరోసారి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 18 రోజుల విరామం అనంతరం బోటు సేవలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల రంపచోడవరం ఆర్డీవో, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బోట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ, పర్యాటక శాఖ, జలవనరుల శాఖ, పోలీసు శాఖ, రవాణా శాఖల అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ప్రతి బోటును సాంకేతికంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. బోట్ల ఫిట్‌నెస్, ప్రయాణికుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రక్షణ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

బోటు ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. ప్రతి ప్రయాణికుడికి లైఫ్ జాకెట్ అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్ని నిబంధనలు పాటించినట్లు నిర్ధారణ కావడంతో దేవీపట్నం మండలం నుంచి పాపికొండల బోటు విహారయాత్రలను తిరిగి ప్రారంభించారు.

అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో పర్యాటకుల రద్దీ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. ప్రారంభ రోజున కేవలం రెండు బోట్లలో మాత్రమే సందర్శకులు పాపికొండల యాత్రకు బయలుదేరారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైతే అదనపు భద్రతా చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. UAN సేవల్లో EPFO భారీ మార్పులు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడానికి కీలక మార్పులు అమలు చేసింది. కొత్త టెక్నాలజీతో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసిన సంస్థ, కొన్ని...
- Advertisement -
Chat on WhatsApp