Monday, June 29, 2026
Chat on WhatsApp
HomeTelanganaRythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లోకి ? ఎప్పుడంటే...

Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా డబ్బులు ఖాతాల్లోకి ? ఎప్పుడంటే ?

-

Chat on WhatsApp

Rythu Bharosa: వ్యవసాయ పెట్టుబడులకు తోడ్పాటు అందించే రైతు భరోసా పథకం కింద నిధుల బదిలీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్ సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా బటన్ నొక్కి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను బదిలీ చేయనున్నారు.

మొదట ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిరలో భారీ బహిరంగ సభగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినప్పటికీ, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభ నిర్వహణ సాధ్యంకాదని అధికారులు నిర్ణయించారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బహిరంగ సభను రద్దు చేసి కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చారు. తాజా నిర్ణయం ప్రకారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన రైతులకే పెట్టుబడి సాయం అందేలా అధికారులు ముందుగానే వివరాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడం ప్రారంభమవుతుంది. సాగు పనుల నడుమ ఆర్థిక సాయం అందుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp