Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsRam Prices | AI దెబ్బకు పెరిగిన ర్యామ్ ధరలు.. 2030 వరకు ram కొరత...

Ram Prices | AI దెబ్బకు పెరిగిన ర్యామ్ ధరలు.. 2030 వరకు ram కొరత తప్పదా?

-

Chat on WhatsApp

Ram Prices: ప్రపంచవ్యాప్తంగా AI సేవలు, డేటా సెంటర్ల వృద్ధి కారణంగా కంప్యూటర్ హార్డ్‌వేర్‌కు అనూహ్య స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ai మోడళ్ల అభివృద్ధి, డేటా సెంటర్ల విస్తరణ కోసం భారీ స్థాయిలో అధిక సామర్థ్య మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడంతో ర్యామ్ (ram) ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఏడాది వరకు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉన్న 16gb DDR5 ర్యామ్ కిట్లు ప్రస్తుతం రెండింతలు, మూడింతలు ధరలకు విక్రయమవుతున్నాయి. 32gb ర్యామ్ కిట్ల ధరలు మరింత వేగంగా పెరిగి పీసీ నిర్మాణ ఖర్చును భారీగా పెంచుతున్నాయి.

ఈ పరిస్థితి ముఖ్యంగా గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, కొత్త కంప్యూటర్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను ప్రభావితం చేస్తోంది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ai రంగం. chatbots, generative ai, machine learning వంటి సాంకేతికతలకు అవసరమైన సర్వర్లు విపరీతమైన మెమరీని వినియోగిస్తున్నాయి. దీంతో మెమరీ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిలో పెద్ద భాగాన్ని ai అవసరాలకే కేటాయిస్తున్నాయి. ఫలితంగా సాధారణ వినియోగదారుల మార్కెట్‌కు సరఫరా తగ్గుతోంది.

ప్రముఖ మెమరీ తయారీ సంస్థ AK HYNIX ప్రకారం, ఈ సరఫరా ఒత్తిడి 2030 వరకు కొనసాగే అవకాశం ఉంది. దీనితో ర్యామ్ ధరలు త్వరలో తగ్గే అవకాశాలు పరిమితంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలను అందించేందుకు AMD, intel సంస్థలు పాత తరహా ప్లాట్‌ఫారమ్‌లు, DDR4 మెమరీకి మద్దతు ఇచ్చే ఉత్పత్తులను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ai విప్లవం సాంకేతిక రంగానికి కొత్త అవకాశాలు తెచ్చిపెడుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం కూడా మోపుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp