Ram Charan Peddi: రామ్ చరణ్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జూన్ 4న విడుదలకు సిద్దమైన ‘పెద్ది’ మూవీ కి తెలంగాణ ప్రభత్వం టికెట్స్ హైక్ కి నో చెప్పింది. ఇక వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది” తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం సూచిస్తోంది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో టికెట్ రేట్లు పెంపు సాధ్యం కాకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, సినిమా టీమ్ టికెట్ ధరల పెంపు కోసం రెండు సార్లు హోం సెక్రటరీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అనుకూల స్పందన రాకపోవడంతో, చివరికి ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లినట్లు సమాచారం.
అయితే తెలంగాణ హైకోర్టు గత తీర్పులను ఆధారంగా చేసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామంతో చిత్ర యూనిట్ తమ పిటిషన్ను తిరిగి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో “పెద్ది” సినిమా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సాధారణ టికెట్ రేట్లకే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఇక ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పవన్ కళ్యాణ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం “పెద్ది” రిలీజ్పై అందరి దృష్టి అధికారిక నిర్ణయంపైనే నిలిచింది.








