మను బాకర్ చెన్నై స్కూల్ ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్!

Manu Bhaker shoots down 'unwanted questions' as fame's double-edged sword  follows her - Sportstar

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత షూటర్‌ మను బాకర్‌ అద్భుత ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలు సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఒకే ఒలింపిక్స్ లో రెండు ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త అథ్లెట్‌గా రికార్డుకెక్కింది. ఈ యంగ్‌ షూటర్‌ తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో సందడి చేసింది. 

ఓ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఆమె.. అక్క‌డ ఏర్పాటు చేసిన‌ స్టేజీపై డ్యాన్స్ చేసి విద్యార్థుల‌ను ఉత్సాహ‌ప‌రిచింది. బాలీవుడ్ సాంగ్‌ ‘కాలా చష్మా’కు అక్కడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఇలా మ‌ను విద్యార్థినిల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియా వైరల్‌ అవుతోంది.

కాగా, ఇటీవ‌ల జ‌రిగిన‌ పారిస్‌ ఒలింపిక్స్ లో మను బాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రెండు కాంస్య పతకాల‌ను గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *