Wednesday, April 15, 2026
Chat on WhatsApp
HomeInterNationalపోలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ కొత్త రికార్డ్

పోలాండ్ పర్యటనలో ప్రధాని మోదీ కొత్త రికార్డ్

-

Chat on WhatsApp
PM Narendra Modi to visit Poland on August 21-22, Ukraine on August 23 |  Latest News India - Hindustan Times

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మోదీ మరో రికార్డును సృష్టించారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. చివరిసారి 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ భారత ప్రధానులు ఎవరూ కూడా ఆ దేశానికి వెళ్లలేదు. ఈ పర్యటనలో వివిధ కీలక అంశాలలో భాగస్వామ్యం, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాలపై పోలాండ్ ప్రెసిడెంట్ తో మోదీ చర్చించనున్నారని తెలిపింది. 

ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత విద్యార్థులకు పోలాండ్ సాయం చేసింది. ఉక్రెయిన్ నుంచి సుమారు 4 వేల మంది భారత విద్యార్థులు పోలాండ్ లోకి అడుగుపెట్టి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు 6 వేల మంది పోలిష్ మహిళలు, చిన్నారులకు భారత భూభాగంలో ఆశ్రయం కల్పించారు. కాగా, పోలాండ్ పర్యటన ముగించుకుని ఈ నెల 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆ దేశ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ తో చర్చలు జరపనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Kavya Maran smiling and accepting a rose from a fan after SRH victory at Uppal Stadium

Kavya Maran | అభిమానితో క్యూట్ మూమెంట్.. గులాబీ పువ్వును తీసుకున్న కావ్యా మారన్

Kavya Maran: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టు అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ విజయంతో...
- Advertisement -
Chat on WhatsApp