Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTAllu Arjun Birthday | బన్నీ బర్త్‌డే బ్లాస్ట్.. రేపే టైటిల్ రివీల్..కానీ ఆ చేతికి...

Allu Arjun Birthday | బన్నీ బర్త్‌డే బ్లాస్ట్.. రేపే టైటిల్ రివీల్..కానీ ఆ చేతికి గోర్లేంటీ భయ్యా

-

Chat on WhatsApp

Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22 x A6పై ఒక్క పోస్టర్‌తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8 ఉదయం 11 గంటలకు టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో భారీ గోర్లు, కింగ్ కాంగ్ తరహా అరచేతి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇది సాధారణ మాస్ సినిమా కాదని, భారీ విజువల్ స్పెక్టకిల్ అవుతుందనే అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రం సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోందని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టైటిల్ రివీల్‌పై ఫ్యాన్స్‌లో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ నెలకొంది.

ఇప్పటివరకు సినిమా కథ ఏమిటి? అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉంటుంది? ఆ పోస్టర్‌లో కనిపించిన గోర్లు దేనికి సంకేతం? అన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా చిత్రబృందం సస్పెన్స్‌ను కొనసాగిస్తోంది. అదే ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది.

దర్శకుడు అట్లీ “లవ్ లెటర్ లోడింగ్” అంటూ చేసిన పోస్ట్ మరింత హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికే జవాన్ తో అట్లీ, పుష్ప 2తో అల్లు అర్జున్ తమ పాన్ ఇండియా రేంజ్‌ను నిరూపించుకున్నారు. దీంతో ఈ కాంబో నుంచి మరో బాక్సాఫీస్ బ్లాస్ట్ రానుందనే అంచనాలు బలపడుతున్నాయి.

ప్రస్తుతం సినిమా గురించి ఒక్కో అప్‌డేట్ బయటకు వస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో బజ్ పెరుగుతోంది. టైటిల్ పోస్టర్ రివీల్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp