Telangana DGP: డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలతో పాటు మొత్తం 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో పార్టీ సెక్రటరీ “దేవుజి అలియాస్ తిప్పిరి తిరుపతి” ముఖ్య వ్యక్తి.
హైదరాబాద్ బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ షివధర్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ ఘటనా వివరణ ఇచ్చారు. మావోయిస్టు పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ, కేడర్ల పెద్ద భాగం ఇప్పుడు జనజీవన స్రవంతిలో చేరినట్లు చెప్పారు.
డీజీపీ ప్రకారం, దేవుజి లొంగిపోవడం పార్టీ చరిత్రలో అత్యంత పెద్ద పరిణామం. ఆరోగ్య సమస్యలు, పార్టీ సిద్ధాంతాలపై అసహనం, ప్రభుత్వ పునరావాస పథకాల విశ్వాసంతో వీరు బయటకు వచ్చారని వెల్లడించారు. గత కొన్ని నెలలుగా తెలంగాణ పోలీసులు చేపట్టిన “రీసెట్” ఆపరేషన్” మరియు నిరంతర కౌన్సెలింగ్ ఫలితంగా ఇది సాధ్యమైందని తెలిపారు.
డీజీపీ పిలుపు
డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టు కార్యకర్తలకు ఆయుధాలు వీడిన తర్వాత “జనజీవన స్రవంతిలో కలవాలని” కోరారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాసం మరియు రివార్డు సొమ్ము అందించబడుతుందని హామీ ఇచ్చారు. “హింస ద్వారా సాధించేది ఏమీ లేదని గుర్తించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి,” అని సూచించారు.
ALSO READ:Toyota Fortuner | 2026 టయోటా ఫార్చ్యూనర్ స్పై ఫోటోలు లీక్…కొత్త డిజైన్తో SUV కింగ్ రెడీ!








