Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర విషాదం...ముగ్గురు స్నేహితులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర విషాదం…ముగ్గురు స్నేహితులు మృతి

-

Chat on WhatsApp

Vantalagummi: జాతరకు వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని వంతలగుమ్మి సమీపంలో చోటుచేసుకుంది.

“గెమ్మలి రమేశ్‌ (22), సిదరి శ్రీధర్ పౌలు (17), రేగం సూర్యప్రకాష్‌ (21)” అనే ముగ్గురు సన్నిహిత మిత్రులు. మహాశివరాత్రి సందర్భంగా హుకుంపేట మండలంలో నిర్వహించిన మత్స్యగుండం జాతరకు వీరు వెళ్లారు. వేడుకలు ముగిసిన అనంతరం ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వంతలగుమ్మి సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ద్విచక్రవాహనం అధిక వేగంతో అదుపుతప్పింది. రెండు విద్యుత్ స్తంభాల మధ్యగా వెళ్లి సమీపంలోని ఓ ఇంటి గోడను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఘటన సమాచారం అందుకున్న పాడేరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామాల్లో శోకసంద్రత వాతావరణం నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp