Municipal Election Results | నల్గొండ & ఖమ్మంలో కాంగ్రెస్ ఘన విజయం

Telangana municipal election results Telangana municipal election results

Municipal Election Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన దుమ్మురేపు ప్రదర్శన కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఘన విజయం సాధించి క్లీన్‌ స్వీప్ చేసింది. చిట్యాలలో 12 వార్డులలో 9, దేవరకొండలో 20 వార్డులలో 10, నందికొండలో 12 వార్డులలో 11 స్థానాల్లో గెలిచింది. మిర్యాలగూడలో 48 వార్డులలో 31, చండూరు 10 వార్డులలో 6, హాలియా 12 వార్డులలో 11 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది.

అలాగే “ఖమ్మం జిల్లాలో” అయిదుచోట్ల కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. వైరాలో 20 స్థానాల్లో 12, మధిరలో 22 స్థానాల్లో 18, కల్లూరులో 20 స్థానాల్లో 12, సత్తుపల్లిలో 23 స్థానాల్లో 12 స్థానాల్లో గెలిచింది. ఏదులాపురంలో మొత్తం 32 వార్డులలో ఇప్పటివరకు 13 వార్డుల్లో గెలిచి, మిగతా వార్డులలో కూడా ప్రభావాన్ని చూపుతోంది.

ఈ ఫలితాలతో “కాంగ్రెస్ పార్టీ” తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *