HomeInterNationalT20 World Cup 2026 | భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ...

T20 World Cup 2026 | భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టాలు

-

Chat on WhatsApp

T20 World Cup 2026: భారత్‌తో తలపడనంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌(2026 T20 World Cup)లో పాల్గొంటామని అంగీకరించినప్పటికీ, ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నిర్ణయం వల్ల ఇండియాకంటే ఎక్కువగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే భారీ నష్టాలు తెచ్చిపెట్టనుందని ఎక్స్పర్ట్స్ అంచనావేస్తున్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టుతో మాత్రమే ఆడనని నిరాకరించడం నిబంధనల ఉల్లంఘన. దీంతో పాకిస్థాన్‌ను టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పించే అవకాశం ఉంది. అంతేకాదు, ఐసీసీ నుంచి ఏటా పీసీబీకి వచ్చే సుమారు 34.5 మిలియన్ డాలర్ల ఆదాయం నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ క్రికెట్‌కు తీవ్ర దెబ్బ.

భారత్–పాక్ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లకు కలిగే నష్టానికి పీసీబీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్‌లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకూ ఆటంకాలు ఎదురవుతాయి.

విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే లీగ్ క్రేజ్ కోల్పోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద భారత్‌తో పెట్టుకోవడం పాక్ క్రికెట్ బోర్డుకు చరిత్రలోనే అతిపెద్ద తప్పుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

also read:Allari Naresh Property Registration | నిడదవోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అల్లరి నరేష్‌ – ఆర్యన్ రాజేష్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp